లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం

by Mahesh |
లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లా కోర్టు సముదాయంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 14630 కేసుల పరిష్కారం జరిగినట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్,జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. ఈ కేసుల పరిష్కారం కోసం మహబూబ్ నగర్ జిల్లా కోర్టు‌లో 5 బెంచీలు,జడ్చర్లలో 1 బెంచి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మోటారు వెహికల్ యాక్సిడెంట్ కోసం కక్షిదారులు దాఖలు చేసిన కేసు నెంబర్ 393/2021 లో నష్టం పరిహారం 35 లక్షల రూపాయలకు గాను ప్రతివాది చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి మధ్య 20 లక్షల రూపాయలకు రాజీ మార్గంలో పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. అలాగే 2018 కు సంబంధించిన భూమి వివాదం కేసులను సీనియర్ సివిల్ కోర్టు వారు పరిష్కరించారని జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, మూడో అదనపు జిల్లా జడ్జి శ్రీదేవి, వివిధ కోర్టుల జడ్జిలు రాజరాజేశ్వరీ, ఇందిర, రాధిక, మమతా రెడ్డి, నిహారిక, భావన, డిఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి తదితర ఇన్సూరెన్స్ మేనేజర్లు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed