చెట్టుకు ఢీకొన్న బైక్.. ఒకరు మృతి, ఒకరికి గాయాలు

by Maddikunta Saikiran |
చెట్టుకు ఢీకొన్న బైక్.. ఒకరు మృతి, ఒకరికి గాయాలు
X

దిశ,దుబ్బాక : బైక్ చెట్టుకు ఢీకొని ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలు అయిన ఘటన దుబ్బాక శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన గుంటి నర్సింలు(50), గుంటి ప్రశాంత్(21) కలిసి డీజిల్ కోసం బైక్ పై చీకోడు రాగా చీకోడులో డీజిల్ లేకపోవడంతో చీకోడు మీదుగా దుబ్బాక కు వెళ్తున్న క్రమంలో దుబ్బాక శివారులోని ఎల్లమ్మ దేవాలయం మూలమలుపు వద్ద ఉన్న చెట్టుకు బైక్ ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. నర్సింలు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో గుంటి నర్సింలు అనే వ్వక్తి మరణించాడు. ప్రశాంత్ కు సిద్దిపేటలోనే చికిత్స అందిస్తున్నారు. మృతుని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు.మృతునికి భార్య మమత, కుమారులు గిరి, భాను ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed