డైట్ చార్జీల పెంపుతో విద్యార్థులు,తల్లిదండ్రులు ఖుషి..!

by Kalyani |
డైట్ చార్జీల పెంపుతో విద్యార్థులు,తల్లిదండ్రులు ఖుషి..!
X

దిశ, మరిపెడ : సంక్షేమ హాస్టల్లు, వసతి గృహాలు, గురుకులల్లో సమస్యల పరిష్కారం తో పాటు పెంచిన డైట్ చార్జీలు నేటి నుంచే అమలు అవుతుండడంతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పర్యటించారు. తోలుత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద మంత్రి పొంగిలేటికి ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ స్వాగతం పలికారు. అనంతరం ఏనాగ్రేషన్లో భాగంగా నియోజకవర్గంలోని సీరోల్, దంతాలపల్లి, నరసింహుల పేట మండలాల్లో నూతనంగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 108 సర్వీసులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అక్కడి నుంచి వివిధ సంక్షేమ వసతి గృహాలు నేరుగా వెళ్లి పరిశీలించడం తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ విద్యార్థులను వాకబ్ చేయడం జరిగింది. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.

పెంచిన డైట్ చార్జీలతో విద్యార్థులు తల్లిదండ్రులు ఖుషి..!

గత పదేళ్లలో మొదటిసారిగా, సంక్షేమ హాస్టళ్ల చరిత్రలో తొలిసారి డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200% నుంచి 250%పెంచే విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, విద్యార్థులను చూడడానికి వచ్చిన వారి తల్లిదండ్రులకు విద్యార్థులు తిరిగి వందో,రెండు వందలో రూపాయలను రేవంత్ అన్న ఇచ్చాడంటూ అనడం సంతోషాన్ని కలిగిస్తుందని మంత్రి పొంగులేటి ఆనందం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారి కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు.!

పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యను అందించాలని లక్ష్యంతో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రూ. 150 కోట్లతో సుమారు 25 ఎకరాల్లో 3,000 మంది విద్యార్థులు చదువుకోడానికి, ఆడడానికి సకల వసతులతో వాటిని నెలకొల్పుతున్నామని ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 5 వేల కోట్లు అవసరమని ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యున్నత స్థానాన్ని కల్పిస్తుందని అన్నారు.

అర్హులైన పేద వారందరికీ నాలుగు సంవత్సరాలు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించడమే లక్ష్యం.!

గత ప్రభుత్వం ఓ పెద్దమనిషి రెండు పడకల గదుల ఇల్లులంటూ అరచేతిలో స్వర్గం చూపించాడని అసలైన పేదవారికి ఇల్లులు కూడా అందలేదని అది ఆ ప్రభుత్వ గొప్పతనమే అంటూ పొంగులేటి ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేద వారికి 10 ఏళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టించారని, ప్రస్తుత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలల్లో సుమారు 20 లక్షల ఇల్లులు పేదవారికి అందించడం లక్ష్యమంటూ అంటూ చెప్పుకొచ్చారు. విద్యా వైద్యానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పునరుద్ఘాటన చేశారు.

జరుపుల తండాను జిపిగా ప్రకటించండి తండావాసులు విజ్ఞప్తి.!

మండలంలోని జరుపుల తండాను ప్రత్యేక గ్రామపంచాయతీ గా ప్రకటించాలని సుమారు 550 ఓట్లు ఉన్నా ఇప్పటివరకు గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఐనా తండావాసులు ఆకాంక్షను నెరవేర్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆ తండావాసులు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ కే.వీర బ్రహ్మచారి, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత జిల్లా అధికారులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed