డాక్టర్ లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ల బృందం

by Kalyani |
డాక్టర్ లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ల బృందం
X

దిశ, గూడూరు: ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన గూడూరు మండలం అయోధ్య పురం గ్రామానికి చెందిన డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ కుటుంబాన్ని జన విజ్ఞాన వేదిక, సోషల్ థింకర్స్ ఫోరం నర్సంపేట, నర్సంపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం పరామర్శించారు. వీరి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ… డాక్టర్ లక్ష్మీ నారాయణ నిస్వార్థపరుడు అని గూడూరు మండలంలో ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రజలకు ఉచిత వైద్యం అందించి, ప్రజలలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు అని డాక్టర్ల ఆత్మీయ సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయుడు, రాజారాం, రాజేంద్ర ప్రసాద్ రెడ్డి , గోపాల్, ఉదయ్ సింగ్,మోహన్ రావు, జగదీశ్వర్, మనోజ్ లాల్ , కిషన్ , రవికృష్ణ, సత్యనారయణ, రాజేష్, శంకర్, సతీష్,భారతి, ఉజ్వల, సుజాత రాణి, వాసవి, హిమబిందు, అమల, ఇంద్రాసేనా రెడ్డి, సోషల్ థింకర్స్ ఫోరం కన్వీనర్ రఘుపతి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed