- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wild Chiken : సీఎం మెడకు 'వైల్డ్ చికెన్' ఉచ్చు
దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Himachal Pradesh CM Sukhvinder Sukhu) 'వైల్డ్ చికెన్'(Wild Chiken) వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ చికెన్ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా(Simla)లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగు సుఖుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో వైల్డ్ చికెన్‌ను కూడా వడ్డించారు. సీఎం సుఖు ఆ వైల్డ్ చికెన్‌ను తినకపోయినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సహా అక్కడ ఉన్న మిగితా తినడం వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అదే ఆసరాగా తీసుకున్న ప్రతిపక్ష బీజేపీ.. సీఎంపై, కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శల దాడికి దిగింది. అయితే 1972 అటవీ సంరక్షణ చట్టం(WildLife Act 1972) ప్రకారం రక్షిత జాబితాలో ఈ వైల్డ్ చికెన్ ఉండగా.. వాటిని వేటాడటం, తినడం నేరం.