Kadapa: మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-12-14 16:37:35.0  )
Kadapa:  మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ  కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు భాష(Telugu language)పై ఈ మధ్య దాడి జరిగిందని మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ(Former CJI Justice NV Ramana) అన్నారు. కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. తాళపత్ర గ్రంథాలు, అరుదైన పుస్తకాలను పరిశీలించారు. అనంతరం తెలుగు వైభవం అంశంపై నిర్వహించిన స్మారక ఉపన్యాసం కార్యక్రమంలో ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యాసం ఇస్తూ రాష్ట్రం విడిపోయాక తెలుగు భాషపై పట్టు వీడుతోందన్నారు. పాలకులు సంక్షేమంపైనే దృష్టిపెడుతున్నారని, భాషపై ఆలోచించడంలేదని చెప్పారు. విదేశీ ఉద్యోగం కోసం మాతృభాషను మర్చిపోతున్నారని మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed