- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు: బీవీ రాఘవులు
దిశ, అచ్చంపేట: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీలకు దేశ సంపదలను కట్టబెడుతున్నారని సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా సిపిఎం పార్టీ జిల్లా మూడో మహాసభ అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల పక్షాన నిలబడుతుందని, ఒక్క అదానీకే 16 వేల కోట్ల రూపాయలను కట్టబెట్టిందని ఆరోపించారు. పేదవాడు తిండి లేక జీవితం కొనసాగిస్తుంటే పెట్టుబడుదారులు, భూస్వాములు రోజురోజుకు సంపన్నులుగా పెరుగుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మన ధర్మ శాస్త్రాన్ని దేశంలో అమలు చేసే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసేందుకే బిజెపి ఉన్నది తప్ప పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం లేదని విమర్శించారు. యూనివర్సిటీలలో, జడ్జిల నియమాకాలలో ఆర్ఎస్ఎస్ బిజెపి తలదూరుస్తుందని.. అందులో భాగమే జడ్జిలు వెళ్లి ఆర్ఎస్ఎస్ మీటింగ్లలో పాల్గొంటున్నారన్నారు.
రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలు
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. పార్టీలు ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం అవుతున్నాని విమర్శించారు. బీజేపీ రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందని ద్వజమెత్తారు. బీజేపీ మతోన్మాద చర్యలు, బీఆర్ఎస్ అధికార దాహంతో చేసే చర్యలు తెలంగాణలో సాగనివ్వమన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై పోరాడుతామని ఈ మహాసభల్లో అటువంటి తీర్మానాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ సాగర్, రాష్ట్ర నాయకులు భూపాల్, వెంకట్ రాములు, ధర్మ నాయక్, జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శులకు సభ్యులు దేశ నాయక్, ఆర్ శ్రీనివాస్, కే గీత, బి ఆంజనేయులు, శ్రీ ఆంజనేయులు, జిల్లా నాయకులు మల్లేష్, శంకర్ నాయక్, నిర్మల, డివిజన్ నాయకులు శివకుమార్, రాములు, వర్ధం సైదులు, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.