నిరుపేద విద్యార్థుల బాగు కోసం ఎంతకైనా దిగజారి పని చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

by Mahesh |
నిరుపేద విద్యార్థుల బాగు కోసం ఎంతకైనా దిగజారి పని చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్ : తల్లిదండ్రులు వాళ్ళ యవ్వనంలో సాధించలేని కలలను వారి పిల్లల చదువులతో సహకారం చేసుకోండని వారి చదువుకు శతవిధాల ప్రోత్సాహకాలు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్లండి అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెరికిట్ ఏరియాలో గల మహిళా ప్రాంగణం ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ మహిళా పాఠశాలలో ప్రభుత్వ రెసిడెన్షియల్ వసతి గృహాల లోని విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచిన సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కార్యక్రమం స్టేజ్ వద్దకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకున్న ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ హాస్టల్ ను మంజూరు చేయించాను అన్నారు. ఆర్మూర్ కు ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను మూడుసార్లు మంజూరు చేస్తూ ఆపినా.. వెనకడుగు వేయకుండా.. మంజూరయ్యేంత వరకు నిరుపేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుని మంజూరు చేయించినట్లు మరోసారి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. నిరుపేదల విద్యార్థుల బాగు కోసం ఎంతకైనా దిగజారి పనిచేస్తానన్నారు. విద్యార్థులను హాస్టల్లో పెట్టి తల్లిదండ్రులు మర్చిపోవడం సరైన పద్ధతి కాదని తరచు వసతి గృహాల్లో జరిగే ప్రతి విషయాలను తెలుసుకుంటూ నిరంతరంగా పెట్టాలన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పైసా విద్యార్థులకు అందేలా వసతి గృహాల బాధ్యులు ఉపాధ్యాయులు చూడాలన్నారు. తన జీవితంలో ఎదురైన ఎన్నో విషయాలను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విద్యార్థులతో పంచుకున్నారు. తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు మరణిస్తే మా అంకాపూర్ గ్రామంలో నన్ను ఎవరూ పట్టించుకోలేదని చాలా నిరుపేద స్థితిలో మా కుటుంబం అప్పట్లో ఉందన్నారు. ఆ సమయంలోనే మా గ్రామంలోని నా దగ్గర బంధువులతో తప్పకుండా నేను పెద్దయ్యాక కోటీశ్వరుని అవుతానని తన చిన్నతనంలోనే తన దగ్గర బంధువులతో చెప్పినట్లు విద్యార్థులకు వివరించారు. తను చిన్నతనంలో చెప్పిన ప్రకారం పెద్దయ్యాక కోటీశ్వరుని అయ్యానని చెప్పారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాలను పెట్టుకొని దాన్ని సాధించడం కోసం అహర్నిశలు శ్రమించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సాధించలేని కళలను వారి పిల్లలతో సాధించుకోవాలన్నారు. 2017 వ సంవత్సరంలోనే 8 ఏళ్ల క్రితమే తను ప్రపంచ ఛాంపియన్ అవుతానని గుకేష్ చెప్పాడని తను చెప్పిన మాట తప్పకుండా.. రెండు రోజుల క్రితం ప్రపంచ ఛాంపియన్ అయ్యాడని గుర్తు చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే సలహాలు

ప్రస్తుతం ప్రభుత్వాలు పిల్లల బాగోగుల పట్ల శ్రద్ధ వహించడం అభినందనీయం అని, ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తరచూ పాఠశాలలను, వసతి గృహాలను సందర్శిస్తూ తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని.. అడగవలసిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు.అడగడం మీ హక్కు అని, మీ జీవితాలు మీ పిల్లల జీవితాలు బాగు పరచుకోవడానికి ప్రతి ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వసతి గృహాల్లోని ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తమ పిల్లలుగా విద్యార్థులను భావించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. రేపటి భారత దేశ భవిష్యత్తు నేటి తరగతి గదుల్లోని విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ఆ విద్యార్థుల జీవితాలను, భవిష్యత్తులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఆడపిల్లలను స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉంచాలన్నారు. అనంతరం వసతి గృహంలోని కిచెన్, టాయిలెట్స్ లను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తనిఖీ చేసి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పక్కాగా పరిశుభ్రత పనులను చేయించాలన్నారు. తరువాత విద్యార్థులతో కలిసి వసతి గృహంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంఈఓ పింజ రాజ గంగారం, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సృజన, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాస్మోటిక్, డైట్ చార్జీల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో నూతన భోజన పట్టికను కళాశాల ఆవరణలో ఆర్మూర్ మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ చంద్రిక లతో కలిసి ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారందరూ భోజనం చేశారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ ఏరియాలో గల సమీకృత వసతి గృహ భవనంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూ ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, ఏసిపి వెంకటేశ్వర రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకే డైట్ చార్జీలను పెంచడం జరిగిందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మొబైల్ ఫోన్ కి బానిస కావద్దని సూచించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ లిక్కి శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story