- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Caste Census: రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే కులగణన సర్వే : భట్టి విక్రమార్క
దిశ, వెబ్ డెస్క్: భవిష్యత్ లో దేశమంతా తెలంగాణ రాష్ట్రాన్ని అనుసరిస్తుందన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకే రాష్ట్రంలో కులగణన సర్వే (Caste Census Survey) నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కులగణనపై గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులగణనపై కాంగ్రెస్ కమిట్ మెంట్ తో ఉందన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదేశాల మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సర్వేతో అందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ కులగణనపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కులగణన తర్వాత ఏయే సంక్షేమ పథకాలకు ఎంతమేర నిధులు కేటాయించాలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని, దీనిపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రులు వెల్లడించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.