POWER CUTS : కేటీఆర్‌ గారు.. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: దళితవాడలో పవర్ కట్‌పై భట్టి కౌంటర్ ట్వీట్

by Ramesh N |
POWER CUTS : కేటీఆర్‌ గారు.. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: దళితవాడలో పవర్ కట్‌పై భట్టి కౌంటర్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం పులికల్ గ్రామంలోని దళిత వాడలో వారం రోజుల నుంచి కరెంటు లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ విష‌యంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ద‌ళిత వాడ‌లో వారం రోజులుగా క‌రెంట్ లేదు.. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క జ‌ర చూడండి అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌కు తను చెప్పినట్లుగా కేటీఆర్ గారు.. ఫర్ యూవర్ ఇన్ఫర్‌మేషన్ అంటూ టీజీఎస్‌పీడిసీఎల్ రిజైండర్ ప్రకటనను పోస్ట్ చేశారు. కరెంట్ విషయంలో ఏదైతే ప్రచారం జరుగుతోందో అది తప్పు అని వెల్లడించారు. దీన్ని రీట్వీట్ చేయడం ద్వారా మీరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వాస్తవాలను వ్యాప్తి చేస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అటువంటి పోస్ట్‌లను షేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ధృవీకరించడం ముఖ్యమని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed