- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అకాల వర్షాలు.. రైతులకు డిప్యూటీ CM భట్టి గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: అకాల వర్షాలతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. తడిచిన ధాన్యం కూడా కొంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై భట్టి సీరియస్ అయ్యారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని.. వాతావరణ శాఖ సూచనలను రైతులకు అందించాలని సూచించారు.
వర్ష సూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటు అని ఎద్దేవా చేశారు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నామని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదన్నారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా ఎంఎస్‌పీ ఇచ్చి కొంటామన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందవద్దు అన్నారు. ధాన్యం రైతులకు మూడు రోజుల్లోనే డబ్బు అందిస్తున్నామని.. రైతులందరూ ధైర్యంగా, నిశ్చింతగా ఉండాలని కోరారు.