- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి Deepadas Munshi
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు. దీపాదాస్‌పై గతంలో బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఇటీవల దీపాదాస్ మున్షి పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సదరు కేసుపై విచారణ జరగనుండగా దీపాదాస్ మున్షి కోర్టుకు హాజరయ్యారు. ఆమెతో పాటు బీజేపీ నేత ప్రభాకర్ కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉంటే రాజకీయ నేతలకు అండగా నిలిచేందుకు వారి నుంచి దీపాదాస్ మున్షి బహుమతులను స్వీకరించానని, ఓ రాజకీయ నేత నుంచి మెర్సిడెస్ కారును బహుమతిగా పొందానని ప్రభాకర్ ఓ టీవీ చానల్ మీటింగ్‌లో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన దీపాదాస్ మున్షి.. ప్రభాకర్ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ కోర్టులో డిఫమేషన్ కేస్ ఫైల్ చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు పార్థాభౌమిక్, శుభలక్ష్మిని ఆ పిటిషన్‌లో సాక్షులుగా చేర్చారు.