Viral Video: రీల్స్ కోసం డేంజర్ స్టంట్స్..! నగరంలో బైకులతో రెచ్చిపోతున్న యువత!

by Ramesh N |   ( Updated:2024-10-15 09:12:11.0  )
Viral Video: రీల్స్ కోసం డేంజర్ స్టంట్స్..! నగరంలో బైకులతో రెచ్చిపోతున్న యువత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్యకాలంలో కొంత మంది యువత రోడ్లపై బైకులతో స్టంట్స్ చేస్తూ ఇతర వాహనాదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లను పెంచుకునేందుకు కొంత మంది డేంజర్ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చీకటి పడిందంటే చాలు రోడ్లపై పోకిరీలు బైకులతో డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి.

తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డైరీ ఫామ్ వద్ద ఓ వ్యక్తి స్కూటిపై స్టంట్స్ వేస్తున్నట్లు ఎక్స్‌లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్రంట్ వీల్స్ పైకి లేపి రెండు కిలోమీటర్ల మేర ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ బైకర్ హంగామా సృష్టించారు. బైకర్‌తో పాటు వేరే బైక్‌పై ఉన్న వ్యక్తులు మొబైల్లో స్టంట్ వీడియోలు చిత్రికరిస్తున్నారు. ఈ వీడియోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. నగరంలో చాలా ప్రదేశాల్లో ఇలా కొంత మంది యువత రోడ్లపై ప్రమాదకర బైక్ స్టంట్స్ వేస్తున్నారని నెటిజన్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు నగర పోలీసులకు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed