Daggubati Purandeswari :బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు పురంధరేశ్వరి.. రాష్ట్ర నేతలతో చర్చ

by Mahesh |   ( Updated:2023-06-28 07:36:01.0  )
Daggubati Purandeswari :బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు పురంధరేశ్వరి.. రాష్ట్ర నేతలతో చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి.. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. జూలై 8వ తేదీన తెలంగాణలో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. కాగా ఈ మీటింగ్ సమన్వయ బాధ్యతలను కేంద్ర పార్టీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరికి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్ల పై రాష్ట్ర నేతలతో ఆమె చర్చించారు. జూలై 8వ తేదీన సమావేశం నేపథ్యంలో.. జూలై 7 సాయంత్రమే ఆయా రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

Read more: BRSకు మరో కీలక నేత షాక్!

Advertisement

Next Story