డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు..

by Vinod kumar |
డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : డిగ్రీ చదివే ప్రతి విద్యార్థికి వ్యాల్యూ ఆడిషన్ లో భాగంగా 4 క్రెడిట్ల సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వైస్ చాన్స్ లర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ విద్యాసంవత్సరంలో చేపట్టబోయే సంస్కరణలు, నూతన కోర్సులు, అకడమిక్ అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు లింబాద్రి వెల్లడించారు. డిగ్రీలో అసెస్ మెంట్, ఎవ్యాల్యుయేషన్ సిస్టమ్ ను అమలు చేయాలని నిర్ణయించారు.

సెక్టర్ స్కిల్ కోర్సులను ఎక్కువ మంది విద్యార్థులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే డిగ్రీలో ఈ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాకుండా బీఎస్సీ హానర్స్ కంప్యూటర్స్ కోర్సును సైతం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పలు వర్సిటీల వైస్ చాన్స్ లర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story