- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముగిసిన తొలిరోజు CWC మీటింగ్.. చర్చించిన అంశాలు ఇవే..!
దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశం అంతర్గతంగా, బహిర్గతంగా అభద్రతను, సవాళ్లను ఎదుర్కొంటున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిందంబరం అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీడబ్ల్యూసీలో చర్చించామని చెప్పారు. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తొలిరోజు చర్చించిన అంశాలను ఆయన మీడియాకు వివరించారు. సమాఖ్య స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. మే 5 నుంచి మణిపూర్ మండిపోతుంటే పార్లమెంట్ సమావేశాలకు ముందు మోడీ కేవలం రెండు నిమిషాలు మాత్రమే స్పందించారని, మణిపూర్‌కు వెళ్లేందుకు ప్రధానికి 2 గంటల సమయం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కశ్మీర్‌లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, నిరుద్యోగం పెరిగిందన్నారు. దేశం తీవ్రమైన విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోందని అన్ని సూచీలు హెచ్చరిస్తున్నయన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వంలో దేశం దశాబ్దాల వెనక్కి వెళ్తోందన్నారు. చైనా దేశ భూభాగాన్ని ఆక్రమిస్తుంటే మోడీ మాత్రం మరొకలా చెబుతున్నారని మండిపడ్డారు.