BREAKING: తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. రూ.2 లక్షల రుణమాఫీకి కటాఫ్ ఫిక్స్ చేసిన రేవంత్ సర్కార్

by Satheesh |   ( Updated:2024-06-21 12:25:58.0  )
BREAKING: తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. రూ.2 లక్షల రుణమాఫీకి కటాఫ్ ఫిక్స్ చేసిన రేవంత్ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో భేటీ అయిన మంత్రి మండలి.. రూ.2 లక్షల రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే రూ. 2లక్షల రుణ మాఫీకి కటాఫ్ తేదీని నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కి ముందు రెండు లక్షల వరకు పంట రుణం తీసుకున్న వారికి లోన్ మాఫీ చేయాలని కటాఫ్ డేట్ ఫిక్స్ చేసింది. ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రుణమాఫీ విధివిధానాలను ప్రకటించనున్నారని సమాచారం.

ఆగస్ట్ 15వ తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో.. జూలై చివరి వారం నుండి మాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి.. ఆగస్ట్ 15 నాటికి కంప్లీట్ చేసేలా సర్కార్ ప్రణాళికలు తయారు చేసినట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నిధులను కూడా సమీకరిస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్.. హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షలు రుణమాఫీ అమలుకు కసరత్తు మొదలుపెట్టింది. రెండు లక్షల రుణమాఫీ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టడంతో ఆ లోగా ఈ ప్రాసెస్ పూర్తి అయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed