‘అంబేద్కర్‌ను కేసీఆర్‌ ఏనాడూ గౌరవించలేదు’

by GSrikanth |
‘అంబేద్కర్‌ను కేసీఆర్‌ ఏనాడూ గౌరవించలేదు’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీలపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఏనాడు అంబేద్కర్‌ను ముఖ్యమంత్రి గౌరవించలేదని కాంగ్రెస్ నేతలు సంపత్, గడ్డం ప్రసాద్, సిరిసిల్ల రాజయ్యలు మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో వీరు మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసమే కేసీఆర్ ఎస్సీలపై కపట ప్రేమను నటిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పరిపానలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. అంబేద్కర్ భావజాలానికి విరుద్ధంగా పరిపాలన చేసిన ఈ ముఖ్యమంత్రికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక అర్హత లేదన్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుని అంబేద్కర్‌ను అపవిత్రం చేయవద్దన్నారు. బీఆర్ఎస్ నేతల బాగు కోసమే దళిత బంధు అమలు జరుగుతోందని దళితులను మోసం చేసిన వారిలో అగ్రస్థానంలో కేసీఆర్ ఉంటారని నేతలు ధ్వజమెత్తారు.

Advertisement

Next Story