హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ. 2. కోట్ల 41 లక్షల నగదు సీజ్

by Ramesh N |   ( Updated:2024-04-15 12:14:53.0  )
హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ. 2. కోట్ల 41 లక్షల నగదు సీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ సందర్భంగా రాష్ట్రంలో జోరుగా క్రికెట్ బెట్టింగ్‌ దందా సాగుతున్నది. రోజు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు తాజాగా మియాపూర్, కూకట్‌పల్లి పరిధిలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే 15 మంది క్రికెట్ బెట్టింగ్‌ ముఠా సభ్యులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 2 కోట్ల 41 లక్షల నగదు, ల్యాప్‌టాప్స్, సెల్ ఫోన్‌లు పోలీసులు సీజ్ చేశారు. వివిధ రకాల ఆన్‌లైన్ ఆప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు గుర్తించారు.

ఈ ముఠా ప్రతిరోజు కోట్ల రూపాయాల బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎవరైనా బెట్టింగ్‌ పాలపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్‌వోటీ పోలీసులు హెచ్చారించారు.

Advertisement

Next Story