హైదరాబాద్ పోలీసులకు సీపీఆర్ శిక్షణ!

by Mahesh |
హైదరాబాద్ పోలీసులకు సీపీఆర్ శిక్షణ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుండెపోటు ప్రస్తుతం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ఇటీవల హైదరాబాద్ లో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్) చేసి అతని ప్రాణాలు నిలబెట్టిన సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్న, మధ్య వయసు వారు కూడా హర్ట్ ఎటాక్ తో మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

దీంతో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హార్డ్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా నగర పోలీసులకు ఉన్నతాధికారులు సీపీఆర్ శిక్షణ ఇప్పిస్తున్నారు. గోషామహల్ పోలీస్ కానిస్టేబుల్స్ కు సీపీఆర్ ఎలా చేయాలో ట్రైనింగ్ ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను నిలబెట్టే సీపీఆర్ పై పోలీసు అధికారులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed