- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్లమెంటులో చర్చకు భయమెందుకు..?అదానీ కుట్రలు బట్టబయలు కావాల్సిందే
దిశ, తెలంగాణ బ్యూరో: అదానీ పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాల గురించి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయనీ, చర్చ చేపట్టాల్సిందేనంటూ రెండు రోజులుగా పార్లమెంటును స్థంభింపజేశాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు చెప్పారు. కానీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. చర్చ చేపట్టేందుకు భయమెందుకని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. దేశ ప్రజల సొమ్మును అదానీ సంస్థ కాజేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ధ్వజమెత్తారు. అదానీపై కుట్ర జరుగుతోందని, అక్రమాల్లేవంటూ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా విదేశీ శక్తులు చేస్తున్న కుట్ర అంటూ ఆర్‌ఎస్‌ఎస్ నాయకులంటున్నారని చెప్పారు. అది కుట్ర, కాదా? అన్నది పార్లమెంటులో చర్చించాలన్నారు. ఆ కుట్రలను ప్రభుత్వమే బట్టబయలు చేయాలనీ, కానీ చర్చించకుండా పార్లమెంటును ఎందుకు నిరోధిస్తున్నదని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నట్టుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని కోరారు. న్యాయవ్యవస్థ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
త్వరలో పొత్తులపై నిర్ణయం: తమ్మినేని
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం ఆనవాయితీగా వస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వృత్తిదారులు, పేదల సంక్షేమానికి మరిన్ని నిధులు అవసరమని సూచించారు. అందుకనుగుణంగా బడ్జెట్ తుదిరూపం ఇచ్చేటపుడు మార్చాలని కోరారు. ఎన్నికలప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ బీఆర్‌ఎస్ నాయకులు సీపీఐ, సీపీఎం తమతోనే ఉంటాయనీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది లేదు, ఒకటి లేదా రెండు ఎమ్మెల్సీలు కేటాయిస్తామంటూ ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు.
కొందరు మంత్రులు కూడా మాట్లాడుతున్నారని చెప్పారు. ఇది బీఆర్‌ఎస్ అధిష్టానానికి తెలిసే జరుగుతుందని తాము అనుకోవడం లేదన్నారు. గతంలో పొత్తులు ఖరారైనపుడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వని దాఖలాలు ఎప్పుడూ లేదని వివరించారు. త్వరలోనే సీపీఐతో పొత్తులపై చర్చిస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తామనీ, ఆ పార్టీని ఓడిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామన్నారు. అంతమాత్రాన బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయరాఘవన్, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు.