కేసీఆర్‌తో CPM నేతల భేటీ.. చర్చకొచ్చిన అంశాలు ఇవే

by sudharani |   ( Updated:2022-09-03 15:27:20.0  )
కేసీఆర్‌తో CPM నేతల భేటీ.. చర్చకొచ్చిన అంశాలు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ తరగతుల ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా కొంత కాలంగా అనేక ఆందోళన, పోరాటాలు సాగుతున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రగతి భవన్‌లో సీంఎను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 3.5 లక్షల మంది పోడు హక్కుపత్రాలు ఇవ్వాలని కోరారు. 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం రుణార్హత కార్డులు, వ్యవసాయ కార్మికుల రోజు కూలి రూ. 600 లు ఉండే విధంగా వెంటనే జీవోను సవరించాలని తెలిపారు.

అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ 5 లక్షలు ఇవ్వాలని కోరారు. వేతన సవరణలు, ఆర్టీసీ సమస్యలు, జీవో 317, ధరణి పోర్టల్‌ సమస్యలు పరిష్కరించాలని వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. లక్ష రూపాయల లోపు రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలన్నారు. గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతానికి రిజర్వేషన్‌ పెంచాలని, అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, కార్డులను ఇవ్వాలన్నారు. చేతివృత్తుల సంక్షేమ పథకాల్లో జరుగుతున్న లోపాలు, అవినీతిని అరికట్టి అర్హులందరికీ అందించాలని కోరారు. పోడు భూముల సమస్యపై క్యాబినెట్‌లో చర్చ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. మునుగోడు నియోజకవర్గ సమస్యలు కూడా చర్చకు వచ్చాయని వివరించారు. సీఎంను కలిసిన వారిలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ శాసనసభా పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి ఉన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

మునుగోడు ఉప ఎన్నికపై KCR సంచలన వ్యాఖ్యలు

NTR vs KCR.. మధ్యలోకి దూరిన కళ్యాణ్ రామ్?

Advertisement

Next Story

Most Viewed