- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BL సంతోష్‌కు నోటీసులిస్తే బండి సంజయ్‌కి ఏడుపెందుకు: కూనంనేని
దిశ, డైనమిక్ బ్యూరో: సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో ఇప్పటి వరకు మూడు వేల ఈడీ కేసులు నమోదు అయ్యాయని, తమ విధానాలకు అంగీకరించని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, బీజేపీకి అనుకూలంగా ఉన్న వారిపై ఒక్కదాడైనా జరిగిందా అని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థల మోసాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నేతల అవినీతిపై దర్యాప్తు సంస్థలు విచారణ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో మల్లారెడ్డి పై కేంద్రం, కేంద్ర సంస్థలపై రాష్ట్ర పోలీసులు కేసులు పెడుతున్నారు. రాష్ట్రాలు కూడా విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కూనంనేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఒక అజ్ఞాని అని, ఆయన నటన ముందు ఎవరూ సరిపోరన్నారు. బీఎల్ సంతోష్ కు నోటీసులిస్తే బండి సంజయ్ ఏడుస్తున్నాడని మరి వరవరరావు లాంటి వారిని జైల్లో పెట్టినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇస్తే తప్పేంటని ఆయన ఏమైనా దేవుడా అని ప్రశ్నించాడు.