- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌తో పొత్తుపై నేడు సీపీఐ తుది నిర్ణయం.. రాజకీయ వర్గాల్లో సస్పెన్స్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరకపోవడంతో కామ్రెడ్స్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు లేదని సీపీఎం తేల్చేయగా.. నేడు సీపీఐ వైఖరిపై క్లారిటీ రానుంది. ఇవాళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన సీపీఐ కార్యవర్గం సమావేశం జరగనుంది. ఈ భేటీలో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లారా? లేదా ఒంటరిగా పోటీలోకి దిగాలా? అనే దానిపై చర్చించనున్నారు.
సీపీఐ చెన్నూరు, కొత్తగూడెం టికెట్లను ఆశిస్తోంది. కానీ మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు చెన్నూరు టికెట్ ఇవ్వాలని హస్తం పార్టీ సమాలోచనలు చేస్తోంది. దీంతో కొత్తగూడెంతో పాటు చెన్నూరుకు బదులుగా మరో సీటును కేటాయించాలని సీపీఐ డిమాండ్ పెట్టింది. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నేడు జరిగే సమావేశంలో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లడంపై సీపీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.