Congress Vs Brs: మీడియా పాయింట్ వద్ద గందరగోళం.. కాంగ్రెస్ నాన్ స్టాప్ ప్రెస్ మీట్స్

by Prasad Jukanti |
Congress Vs Brs: మీడియా పాయింట్ వద్ద గందరగోళం.. కాంగ్రెస్ నాన్ స్టాప్ ప్రెస్ మీట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గందరగోళం ఏర్పడింది. మీడియా పాయింట్ లో మైక్ కోసం ప్రతిపక్షాల మైక్ కోసం నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరం నడిచింది. సభ వాయిదా అనంతరం అధికార కాంగ్రెస్ సభ్యులు ఒకరి తర్వాత మరొకరు వరుసగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. దీంతో కావాలనే కాంగ్రెస్ సభ్యులు మీడియా పాయింట్ లో ఎక్కువ సేపు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట వద్ద అవకాశం కోసం బీఆర్ఎస్ ఎదురుచూస్తున్న క్రమంలో మరో వైపు బీజేపీ సభ్యులు సైతం మైక్ కోసం వేచి చూశారు.

బీఆర్ఎస్ నిరసన:

కాంగ్రెస్ సభ్యుల తీరుపై బీఆర్ఎస్ సభ్యులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఏం మొహం పెట్టుకుని వచ్చారని భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధకు గురి చేస్తున్నాయని ఆవేదన చెందారు. అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదని తమ ఆవేదనను మీడియా పాయింట్ వద్ద చెప్పుకుందామని వస్తే అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ సభ్యులు నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదని సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించారన్నారు. అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమానించే రోజు వచ్చిందంటే తలొంచుకోవాల్సిన రోజు ఇది అన్నారు.

Advertisement

Next Story

Most Viewed