- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు గ్యారెంటీ కార్డులపై కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఇప్పటి వరకు పరిమిత స్థాయిలోనే ఆరు గ్యారంటీ కార్డులను అందజేసిందని పార్టీ ప్రకటించింది. కీలక నేతలు, పార్టీ లీడర్ల వద్ద మాత్రమే అవి ఉన్నాయని పేర్కొన్నది. కానీ మార్కెట్‌లో విచ్చల విడిగా గ్యారంటీ కార్డుల పేరిట పంపిణీ జరుగుతున్నట్లు పార్టీ దృష్టికి వచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్కెట్లో ఫేక్ కార్డులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచించింది. ఆరు గ్యారంటీలపై త్వరలోనే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫేక్ కార్డులు కనిపిస్తే పోలీస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఫిర్యాదు చేయొచ్చని వివరించింది.
వాస్తవానికి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించి వాటిని తమ నాయకులు, కార్యకర్తల ద్వారా ఓటర్లకు అందజేశామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు స్పష్టంచేశారు. ఆ కార్డులు ఎవరి దగ్గర ఉన్నాయనే విషయం పార్టీలో నమోదైందన్నారు. కానీ కొందరు దళారులు వాటిని మీ సేవా, ఆన్ లైన్ సెంటర్ల ద్వారా ఫోటో మార్పిడి చేసి ఫేక్ గ్యారంటీ కార్డులను తయారు చేస్తున్నారన్నారు. ఆ నకిలీ కార్డులను పొందడం వలన ఉపయోగం లేదన్నారు. దళారులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని, అర్హులకు నేరుగా ప్రభుత్వమే సాయం అందజేస్తుందన్నారు. దీనిపై డీజీపీకి కూడా లెటర్ ద్వారా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.