- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో కాంగ్రెస్‘సెగ’.. 20 వేల మందితో నిరసనలు
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీలో కాంగ్రెస్పార్టీ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్నది.రాహుల్ గాంధీ ఎంపీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఏప్రిల్3న ధర్నాలు చేయనున్నారు. జంతర్మంతర్వద్ద దీక్షలు నిర్వహించనున్నారు.అఖిల భారత ఫిషర్మెన్కాంగ్రెస్ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్షలకు దేశ వ్యాప్తంగా వివిధ కాంగ్రెస్కమిటీల నుంచి సుమారు 20 వేల మంది హజరయ్యే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించారు. ఏఐసీసీ ముఖ్య లీడర్లతో పాటు ఢిల్లీ కాంగ్రెస్పార్టీ ప్రతినిధులు కూడా భారీ సంఖ్యలో ఈ ధర్నాలో భాగస్వామ్యం కానున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక మన రాష్ట్రంలో నుంచి కూడా ఈ సభలో వేల మంది కాంగ్రెస్నేతలు వెళ్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫిషర్మెన్కాంగ్రెస్చైర్మన్మెట్టు సాయికుమార్మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే బీజేపీ విధానం అని మండిపడ్డారు.మోడీ నిరంకుశ పాలన కు అతి త్వరలోనే అంతం పలుకుతామన్నారు. చర్యకు ప్రతి చర్య ఉన్నట్టుగానే బీజేపీ చేస్తున్న ప్రతీ తప్పుడు నిర్ణయాలను తిప్పికొడతామన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే దేశ వ్యాప్తంగా బీజేపీ గొంతు నొక్కుతుందన్నారు. బీజేపీ అదానీ,అంబానీ ల ప్రయోజనం కోసం ముందుకు సాగుతుందన్నారు. పేదల పొట్టకొడుతూ కార్పొరేట్లకు దేశాన్ని దారదత్తం చేస్తున్నారని సాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.