కర్ణాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

by Mahesh |   ( Updated:2024-01-02 12:31:06.0  )
కర్ణాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్‌ షర్మిల తన వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం పార్టీ కార్యకర్తలతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తనకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును ఆఫర్‌ చేసిందని నేతలతో వెల్లడించారు. అలాగే తనకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు చెప్పారు. దీనికి ఆమెను ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని కోరినట్లు ఆమె తెలిపారు.

కాగా, వైఎస్‌ఆర్‌టీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజ గోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ రోజు వైఎస్ షర్మిలతో పార్టీ సమావేశంలో 60 నుంచి 70 మంది ఉన్నారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి దాదాపు 20 నుంచి 30 మంది హాజరవుతారు, అక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలాగే జనవరి 8న రాజ్యసభ సభ్యత్వంపై చర్చిస్తానని వైఎస్‌ఆర్‌టీపీ నేతలతో షర్మిల చెప్పినట్లు సమాచారం.

వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం నిరాశకు గురిచేస్తోందని, షర్మిల ఏఐసీసీలో నియమితులైతే తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని సంతోషిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. షర్మిలకు తెలంగాణ కోసం పని చేయాలనే ఆసక్తి ఉన్నందున మా పార్టీ నాయకులు ఆమెను ఖమ్మం, నల్గొండ లేదా సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుబట్టారు. తెలంగాణలో పార్టీకి ఖ్యాతి కోసం మేమంతా ఎదురుచూస్తున్నామని వైఎస్ఆర్‌టీపీ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

Advertisement

Next Story

Most Viewed