- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయా స్ట్రాటజీ.. లోక్‌సభ ఎన్నికల వేళ టీ.కాంగ్రెస్‌కు ఏఐసీసీ టాస్క్ ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ గెలవాలని కాంగ్రెస్ కొత్త స్ర్టాటజీతో ముందుకు వెళ్లనున్నది. ఇందుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నది. ఇందులో భాగంగా నేడు గాంధీభవన్‌లోని ఇందిరాహాల్లో ‘కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ’ మీటింగ్ నిర్వహించనున్నది. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో, ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలు ఎలా వివరించాలి? పార్టీకి ప్రజల నుంచి మరింత మద్దతు ఎలా పెంచాలి? వంటి అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనున్నది. అన్ని జిల్లాల డీసీసీలు, పార్లమెంటు ఇన్‌చార్జీలు, కొందరు మంత్రులు హాజరుకానున్నారు. సీఎం రేవంత్‌నూ రావాలని పార్టీ ఆహ్వానించినప్పటికీ, పరిపాలనా అంశాల దృష్ట్యా ఆయన షెడ్యూల్ ఖరారు కాలేదని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు.
12కు తగ్గకుండా..
15 ఎంపీ సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ కనీసం 12కు తగ్గకుండా గెలవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నది. ఏఐసీసీ అగ్రనేతలు కూడా రాష్ట్ర పార్టీకి ఇదే టాస్క్‌ను అప్పగించారు. తెలంగాణ నుంచి మెజార్టీ పార్లమెంటు సీట్లు గెలవాల్సిందేనని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఇక్కడి నేతలకు నొక్కి చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయిన అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే, అప్పుడు జరిగిన లోపాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే జిల్లాల్లో సీట్లు కోల్పోయాం? ఎక్కడ సీట్లు ఎక్కువగా వచ్చాయి? వంటి అంశాలు పార్లమెంటు సెగ్మెంట్‌ల వారీగా అనాలసిస్ చేయనున్నారు.