- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొత్తం ఆ శాఖనే ప్రక్షాళన చేయాలి.. వీహెచ్ సంచలన డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ హయాంలో పేదల భూముల్ని దొరలు దోచుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీసరలో రూ.100 కోట్ల స్కామ్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ హయాంలో కీసర పరిధిలో మాదిగలకు 94 ఎకరాల భూమిని 10 మందికి ప్రభుత్వం కీసరలో ఇచ్చిందని వీహెచ్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగి కృష్ణారెడ్డి దురుద్దేశంతో సంతకాలు పోర్జరీ చేసి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవడంలేదని తెలిపారు. ఆ భూముల్లో వెంటనే పనులు ఆపేయాలని వీహెచ్ అన్నారు. పేదలు భూములు కోల్పోతే, మరోవైపు అక్కడ విల్లాలు కడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎవరి భూమి వారికే అన్నారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పటికీ ఏం జరుగుతోందని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అక్రమాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. మొత్తం రెవెన్యూ వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని కోరారు.