- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణి అంతా మోసం.. ఈడీకి బక్క జడ్సన్ ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి అంతా మోసమేనని, పేదలకు నష్టం చేకూరుస్తుందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్పేర్కొన్నారు. సాప్ట్‌వేర్‌లో స్కామ్ జరిగిందంటూ ఆయన సోమవారం ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.పోర్టల్సమస్యతో 40 లక్షల ఎకరాలు నిషేదిత భూముల జాబితాలోకి చేరిపోయిందన్నారు. గ్రేటర్హైదరాబాద్ పరిధిలోనే ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎక్కడా చూడని చిత్ర విచిత్రాలు ధరణిలో కనబడుతున్నాయన్నారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శించారు.
ధరణి ప్రారంభమైన రెండేళ్లలోనే దాదాపు వెయ్యి కోట్ల ఆదాయాన్ని వెనకేసుకున్నదన్నారు. ఇప్పటి వరకు ధరణి పోర్టల్ చోటు చేసుకున్న తప్పులను సవరించమని దాదాపు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఊర్లే ధరణిలో కనిపించకుండా పోయే పరిస్థితి దాపురించిందన్నారు. దీనిపై వెంటనే ఎంక్వైరీ చేసి ధరణితో పేదలకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని జడ్సన్రిక్వెస్ట్ చేశారు.