- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆమె లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదు: అద్దంకి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ దశాబ్ధి వేడుకలను అంగరంగ వైభంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. జూన్ 2న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రత్యే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వ్యక్తిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించింది. ఆమెతో పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఆర్పించిన అమరుల కుటుంబాలను సైతం ఈ వేడుకల్లో సన్మానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా అన్ని రాజకీయా పార్టీలను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. ఇక, సోనియా గాంధీ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేది కాదని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ మిగిలిపోతారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కొందరికే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. అందుకోసమే తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి రాజకీయ వ్యాపారంగా మార్చారని ఫైర్ అయ్యారు.