రెండు రౌండ్లు ముగిసే సరికి మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-03 05:08:39.0  )
రెండు రౌండ్లు ముగిసే సరికి మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. రెండో రౌండ్ ఫలితాలు ముగిసే సరికి మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటింది. హైదరాబాద్, మెదక్ తప్ప అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. నల్గొండలోని మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఏడు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఖమ్మంలో కాంగ్రెస్ 8, సీపీఐ 1, బీఆర్ఎస్ పార్టీ ఒక స్థానంలో లీడ్ లో ఉన్నాయి. రంగారెడ్డిలో బీఆర్ఎస్ 7 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 4 స్థానాల్లో ముందంజలో ఉంది.

Advertisement

Next Story