- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరుంటే మాకేందిరాబై..ఎమ్మెల్యే ముందు తన్నుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు
దిశ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సఖ్యత ఉండదు అని ఎప్పటి నుండో వస్తున్న నానుడి. ఆ నానుడిని నిజం చేస్తూ పెద్దపల్లి కాంగ్రెస్‌లో విబేధాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకే పార్టీకి చెందిన నాయకులం అనే విషయాన్ని మరిచి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు అక్కడి నాయకులు.. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మున్సిపాలిటీ రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేసింది. కాగా ఆ ట్రాక్టర్లను ఓపెన్ చేసేందుకు నిన్న (సోమవారం) ముహూర్తం ఖరారు చేసి ప్రారంభమహోత్సవానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొదటిసారిగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నిన్న పెద్దపల్లికి వెళ్లారు. ఇక టాక్టర్ల ప్రారంభోత్సవంలో కొబ్బరి కాయలు కొట్టే క్రమంలో కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్, నూగిళ్ల మల్లయ్య మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌ను పక్కకు జరగమని మల్లయ్య అడిగారు. దీనితో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇక పోలీసుల చొరవతో ఇరువురు సద్దుమణగగా ఎమ్మెల్యే ట్రాక్టర్లను ప్రారంభించారు. ఆ తరువాత బడ్జెట్ సమావేశం నిర్వహించారు. కాగా బడ్జెట్ సమావేశం జరుగుతున్న సమయంలో సమావేశ మందిరంలోకి చేరుకున్న కౌన్సిలర్ల అనుచరులు ఎమ్మెల్యే ముందే కొట్టుకున్నారు. ఇక ఎమ్మెల్యేతోపాటు బయటకు వచ్చిన కౌన్సిలర్ శ్రీనివాస్.. నూగిళ్ల మల్లయ్య అనుచరులు దాడి చేశారని ఆరోపించారు.
దీనితో ముదిరాజ్‌లను మున్నూరు కాపులు అణగదొక్కుతున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. ఇక గొడవ సద్దుమణగక ముందే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు అందరిని అక్కడి నుంచి పంపించారు. కౌన్సిలర్లు శ్రీనివాస్, మల్లయ్య ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.