BREAKING: కవిత బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

by Satheesh |   ( Updated:2024-05-28 10:43:44.0  )
BREAKING: కవిత బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సోమవారం ఆమె తరుఫు లాయర్ల ఆర్గూమెంట్స్ విన్న జడ్జి స్వర్ణకాంత శర్మ.. మంగళవారం దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ తరుఫు లాయర్ల వాదనలు విన్నారు. ఇవాళ ఇరు వైపుల వాదనలు ముగియడంతో కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా..? రాదా..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత.. ఈ కేసులో తన అరెస్ట్‌ను సవాల్ చేయడంతో పాటు బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. తాజాగా ఫైనల్ జడ్జిమెంట్‌ను రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో కవితది కీలక పాత్ర అని, కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దొని దర్యాప్తు సంస్థలు వాదిస్తుండగా.. అసలు ఈ కేసు నిందితుల జాబితాలో కవిత పేరు లేదని.. ఈ కేసులో అరెస్ట్ అయిన, అప్రూవర్లుగా మారిన నిందితులు స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారని కవిత తరుఫు లాయర్లు వాదించారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed