- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాజీ CM కేసీఆర్‌పై కంప్లైంట్.. ఆ కేసులో ఏ1గా చేర్చాలని అరుణ్‌కుమార్ డిమాండ్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏ1 నిందితునిగా చేర్చి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు అడ్వకేట్అరుణ్కుమార్పంజాగుట్ట సీఐ శోభన్‌కు లిఖితపూర్వక కంప్లైంట్ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్పలు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక అనుమతులతో మాత్రమే ఫోన్లు ట్యాపింగ్చేయాల్సి ఉంటుందని తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా అనుమానాలు ఉన్నవారి ఫోన్లను మాత్రమే ట్యాప్చేయాల్సి ఉండగా బీఆర్ఎస్ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రధాన నాయకుల ఫోన్లను ట్యాప్చేయించినట్టు పేర్కొన్నారు. ఇదంతా కేసీఆర్లబ్ధి కోసమే జరిగిందన్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఏ1 నిందితునిగా పేర్కొంటూ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.