- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nitin Gadkari: రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nithin Gadkari) సూచించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ పరిగణనలోకి తీసుకోబోరని భావిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ప్రధాని మోడీ(Pm modi) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe byden)లా జ్ఞాపకశక్తి కోల్పోయారని రాహుల్ చేసిన ఆరోపణలపై స్పందించిన గడ్కరీ.. రాహుల్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అబద్ధాలపై ఆధారపడి ఉందని ప్రజలకు అర్థమైందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి (Mahayuthi alliance)కి ప్రజలు మద్దతు తెలుపుతారని దీమా వ్యక్తం చేశారు. ‘అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. మనమంతా ఒక్కటే. కొందరు గుడికి, మరికొందరు మసీదులకు, గురుద్వారాలకు, చర్చిలకు వెళ్తుంటారు. కానీ మనమంతా భారతీయులం. దేశం మనకు అన్నింటికంటే ముందుంది’ అని వ్యాఖ్యానించారు.
Read More..
Navneet Rana: బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రాణాపై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం