- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Case Filed: గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిపై కేసు నమోదు.. ప్రధాన కారణం అదే!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ (YCP) నాయకులపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ (YCP) ముఖ్య నేత, గుంటూరు మేయర్ (Guntur Meyor) మనోహర్ నాయుడి (Manohar Naidu)పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంతో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pavan Kalyan)లపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మేయర్‌పై టీడీపీ (TDP) నేత కనపర్తి శ్రీనివాసరావు (Kanaparthy Srinivasa Rao) గుంటూరులోని అరండల్‌పేట (Arandalpet) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు మేయర్ మనోహర్ నాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, చంద్రబాబు (Chandrababu)ను అరెస్ట్ చేసిన సమయంలో టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీ శ్రేణులు అరండల్‌పేట (Arandalpet)లో నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మనోహర్ నాయుడు (Manohar Naidu) స్పాట్‌కు చేరుకుని హల్‌చల్ సృష్టించాడు. ఏకంగా పోలీసుల లాఠీ పట్టుకుని రెండు పార్టీల నేతలను చెరగొట్టేందుకు యత్నించాడు. తాజాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మనోహర్ నాయుడిపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు (Kanaparthy Srinivas Rao) ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది.