Lagacharla : సీఎం రేవంత్ రెడ్డిపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

by Ramesh N |
Lagacharla : సీఎం రేవంత్ రెడ్డిపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Lagacharla) కొడంగల్ నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా, లగచర్ల గ్రామ ఘటనపై ప్రజా సంఘాలు సీరియస్ అయ్యాయి. ఢిల్లీలో లగచర్ల బాధితులకు మద్దతుగా ప్రజాసంఘాల నేతలు నిలిచారు. లగచర్ల ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశాయి. లగచర్ల ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రజాసంఘాలు కోరాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా బాధిత కుటుంబాలను యుద్దప్రాతిపదికన ఆదుకోవాలని ప్రజాసంఘాలు ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఫార్మా కంపెనీ విషయంలో పోలీసులు ప్రవర్తన, బలవంతపు భూసేకరణ చేస్తూ ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు తాజాగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ (National SC and ST Commission) కు ఫిర్యాదు చేశారు.

బాధిత కుటుంబాలకు, వ్యక్తులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించాలని, ఇంతంటి అఘాయిత్యానికి పాల్పడ్డ సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నేతలు కమిషన్‌ను కోరారు. అదేవిధంగా అమాయక గిరిజనులను జైలుకి పంపారని, బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు డా కళ్యాణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story