- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Acne: మొటిమలను గోళ్లతో గిల్లుతున్నారా? మచ్చలకే కాదు.. మరిన్ని సమస్యలకు దారితీస్తుంది..!
దిశ, వెబ్‌డెస్క్: పింపుల్స్(pimples) ప్రాబ్లమ్‌ను సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు ఫేస్ చేస్తుంటారు. అబ్బాయిలు అంతగా పట్టించుకోకపోయినా.. ముఖంపై చిన్న మొటిమ కాగానే అమ్మాయిలు మాత్రం తెగ కంగారుపడుతుంటారు. ఇంట్లోనే పలు చిట్కాలు ఫాలో అవుతారు. మరికొంతమంది అయితే ఫేస్‌పై చూడానికి బాలేదని పింపుల్స్‌ను గిల్లుతుంటారు. దీంతో ఆ ప్లేస్‌లో మచ్చ ఏర్పడుతుంది. అది తగ్గడానికి నెలల సమయం పడుతుంది.
అంతేకాకుండా గుంటలు కూడా పడుతాయి. పైగా మొటిమ గిల్లడం ద్వారా బ్యాక్టీరియా(Bacteria) స్కిన్ లోపలికి వెళ్లే చాన్స్ ఉంది. అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్(Inflammation)కు కారణమవుతుంది. కణాల మరమ్మతుకు అంతరాయం కలుగుతుంది. తద్వారా పింపుల్ గిల్లిన ప్లేస్‌లో మచ్చలు, దురద, ఎరుపు, గుంతలు పడి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. కాగా పింపుల్స్‌ను గిల్లడం వెంటనే మానేయండి. వాటి అంతట అవే మానేవరకు వెయిట్ చేయండి.
కాగా పింపుల్స్ వస్తే మేకప్(Makeup)కు దూరంగా ఉండటం మేలు. మేకప్ వేసినట్లైతే పింపుల్ మరింత ముదిరిపోయే చాన్స్ ఉంటుంది. అలాగే మొటిమపై దుమ్ము పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ దుమ్ము, ధూళి పడితే.. దానిపై బ్యాక్టీరియా చేరి.. పుండుల తయారవుతుంది.
పింపుల్ పాప్ అయ్యాక క్లెన్సర్‌తో ఆ ప్లేస్‌లో మెల్లిగా క్లీన్ చేయండి. బ్లడ్, చీము లాంటివి ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే చాన్స్ ఉంటుంది కాబట్టి.. యాంటీసెప్టిక్ క్యాన్సర్(Antiseptic cancer)ను ఉపయోగించడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో సీరం వాడడం ఆపేయండి. సువాసన లేని తేలకపాటి మాయిశ్చరైజర్‌ను పింపుల్స్‌పై అప్లై చేయండి. దురద, మంట రాకుండా మాయిశ్చరైజర్ కాపాడుతుంది.
Read More..