చెట్ల కొమ్మల వెనక పొంచి ఉన్న ప్రమాదం..

by Sumithra |
చెట్ల కొమ్మల వెనక పొంచి ఉన్న ప్రమాదం..
X

దిశ, ఇబ్రహీంపట్నం : మండల పరిధిలోని ఇబ్రహీంపట్నం నుంచి రాయపోల్ గ్రామానికి వెళ్లే మార్గమధ్యలో రోడ్డు మూలమలుపుల వద్ద చెట్ల కొమ్మలు రోడ్డుకిరువైపులా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. దీంతో రోడ్డు పై ప్రయాణిస్తున్న వాహనదారులకు కనిపించకపోవడంతో నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రోడ్డు మార్గంలో ఇబ్రహీంపట్నం (సాగర్ హైవే) నుండి తూప్రాన్ పేట్ (విజయవాడ హైవే) వరకు వెళ్తుంది. కాబట్టి రెండు హైవేలను కలుపుతున్న ఈ రోడ్డులో మూలమలుపుల వద్ద చెట్లు ఇరువైపులా ఏపుగా పెరిగి రోడ్లను కమ్మేస్తున్నాయి. ఈ మూలమలుపుల వద్ద ఎప్పుడూ ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించిన అధికారులు తొందరగా చర్యలు తీసుకుని వెంటనే చెట్ల కొమ్మలను కొట్టించాలని వాహనదారులు కోరుతున్నారు. అలాగే వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటుందని ప్రయాణికులు తెలిపారు.

ఈ రోడ్డు ఇబ్రహీంపట్నం నుంచి రాయపోలు ముకునూరు, దండు మైలారం, తూప్రాన్ పేట్ వరకు విజయవాడ హైవేను కలుపుతూ ఉంటుంది. ఈ రోడ్డు ఇబ్రహీంపట్నం నుంచి రాయపోలు ముకునూరు దండు మైలారం తూప్రాన్ పేట్ విజయవాడ హైవేను కలుపుతూ ఉంటుంది. దీనివల్ల రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. చెట్ల కొమ్మలు రోడ్ల మీదకు రావడంతో ఎదురెదురుగా వాహనాలు కనిపించక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదంటున్నారు బీఆర్ఎస్ నాయకుడు చిన్నెల్లి మహేష్.

Advertisement

Next Story