- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Not Giving Way : అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు.. రూ. 2.50 లక్షలు ఫైన్
దిశ, డైనమిక్ బ్యూరో: కుయ్.. కుయ్ అంటూ రోడ్డుపై అంబులెన్స్ (Ambulance) వచ్చిందంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే అంబులెన్స్ వెళ్ళడానికి దారి ఇవ్వాలని వాహనాలను సైడ్ తీసుకుంటారు. లేదంటే వాహనాన్ని పక్కకు ఆపుతారు. కానీ కొంత మంది ఆకతాయిలు అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండ నిర్లక్ష్యంగా (not given way) కారు నడిపినందుకు కారు ఓనర్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. (Kerala) కేరళలో ఈ ఘటన జరిగింది. అంబులెన్స్ చాలా సేపటి నుంచి కుయ్.. కుయ్.. అంటూ సౌండ్, హారన్ కొడుతున్నా కూడా.. కారు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషంట్‌లను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ఎన్ని సార్లు హారన్ కొట్టిన కూడా కారు డ్రైవర్ అంబులెన్స్‌ను ముందుకు వెళ్లేందుకు దారి మాత్రం ఇవ్వలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు కారు యజమానికి రూ.2.50 లక్షల ఫైన్ వేయడంతో పాటు అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారు. కారు యజమానికి ఫైన్‌తో పాటు అరెస్ట్ చేసి ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు అతనికి లైసెన్స్, ఫైన్ వేసినందుకు నెటిజన్లు పోలీసులను ప్రశంసిస్తున్నారు.