- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News : గ్యాస్ సిలిండర్ పేలి 25 మందికి తీవ్ర గాయాలు
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని ఛతర్‌పూర్(Chattharpur) జిల్లాలోని బిజావర్(Bijavar) పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని బస్టాండ్ సమీపంలోయి ఓ చిన్న హోటల్ లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో.. 25 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాద స్థలికి చేరుకున్న బిజావర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజావర్ లోని ఓ రద్దీ ప్రదేశంలో అనుమతులు లేని ఓ హోటల్ లో గ్యాస్ లీక్ అయి, సిలిండర్ పేలడంతో అక్కడే భోజనం చేస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఛతర్‌పూర్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నామని ఛతర్‌పూర్ ఎస్పీ తెలియ జేశారు.
- Tags
- FireAccident