పవర్ కమిషన్ కార్యాలయానికి కమిషన్ చీఫ్ జస్టిస్ మధన్ భీం రావ్ లోకూర్

by Y. Venkata Narasimha Reddy |
పవర్ కమిషన్ కార్యాలయానికి కమిషన్ చీఫ్ జస్టిస్ మధన్ భీం రావ్ లోకూర్
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ మధన్ భీం రావ్ లోకూర్ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. విద్యుత్తు ఫ్లాంట్ల నిర్మాణాలు, కొనుగోలుకు సంబంధించి గత చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి హయాంలో జరిగిన విచారణ డాక్యుమెంట్స్ పరిశీలన పూర్తి కావడంతో దుపరి విచారణ ప్రక్రియపై ఆయన దృష్టి పెట్టారు. కమిషన్ స్టాప్ తో జస్టిస్ భీం రావ్ లోకూర్ సమావేశం అయ్యారు. విద్యుత్తు కోనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మలో ఫ్లాంట్ల నిర్మాణాలలో అవతవకలపై విచారణ చేపట్టిన పవర్ కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధికారులను, మాజీ విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డిని విచారించడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ నుంచి వివరణ ఇవ్వాలని కోరారు. అయితే విచారణ అంశాలను మీడియాతో పంచుకోవడాన్ని తప్పు బట్టిన కేసీఆర్ సుప్రీం కోర్టులో పవర్ కమిషన్ నిబద్దతను సవాల్ చేశారు.

సుప్రీమ్ కోర్టు ఆదేశాల క్రమంలో పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఆయన స్థానంలో జస్టిస్ మధన్ భీం రావ్ లోకూర్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మధన్ భీం రావ్ లోకూర్ ముందుగా జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి చేసిన విచారణ అంశాలను, నివేదికను పరిశీలించారు. వాటి పరిశీలన పూర్తి కావడంతో తదుపరి విచారణ ప్రక్రియ నిమిత్తం పవర్ కమిషన్ కార్యాలయంలో అధికారులతో కీలక భేటీ నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed