CM Revanth: తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |
CM Revanth: తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంక్రాంతి(Sankranti) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నాలుగు సంక్షేమ పథకాల(Welfare Schemes) అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోంది అన్నారు. గాలిపటాలు ఎగురవేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, సంక్రాంతి కానుకగా రైతుభరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. మూడు హామీలను జనవరి 26 నుంచి అమలు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతి కానుకగా.. ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed