- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
‘ఇకపై నేనే ఫీల్డ్లోకి దిగుతా’.. కలెక్టర్లకు CM రేవంత్ స్వీట్ వార్నింగ్..!
![‘ఇకపై నేనే ఫీల్డ్లోకి దిగుతా’.. కలెక్టర్లకు CM రేవంత్ స్వీట్ వార్నింగ్..! ‘ఇకపై నేనే ఫీల్డ్లోకి దిగుతా’.. కలెక్టర్లకు CM రేవంత్ స్వీట్ వార్నింగ్..!](https://www.dishadaily.com/h-upload/2024/06/27/346804-revanth.webp)
దిశ, వెబ్డెస్క్: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సచివాలయంలో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం మర్చిపోయారని, ఇక నుండి అలా కుదరదని కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇకపై నేను కూడా ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు, ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ప్రతీ నెలా అన్ని డిపార్ట్మెంట్ల సెక్రటరీలతో సమావేశం ఉంటుందని చెప్పారు. వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పని చేస్తే కుదరదని హెచ్చరించారు. పని చేసే అధికారులకు నా సహకారం ఉంటుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ, నెల చివర్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అన్ని శాఖల సెక్రటరీలతో రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది.