CM Revanth Reddy's : తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-30 08:07:14.0  )
CM Revanth Reddys : తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సతీమణి గీతా రెడ్డి(wife Geetha Reddy) దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, అల్లుడు, కూతురు, మనవడు సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మెుక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదాలను అందించారు.

మే నెలలో సీఎం రేవంత్ రెడ్డి తన మనవడి పుట్టువెంట్రుకలను శ్రీవారికి సమర్పించేందుకు కుటుంబంతో పాటు తిరుమల సందర్శించారు.

Advertisement

Next Story