గాంధీ కుటుంబం మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుంది: సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
గాంధీ కుటుంబం మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కులగణన(Kulagana)పై కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో సమీక్ష మీటింగ్ ఎర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)తో పాటు కీలక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక నేతలు పాల్గొన్నారు. అనంతరం బీసీ కులగణన పై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం(Gandhi Family) మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందని స్పష్టం చేశారు.

అలాగే కులగణనపై సమన్వయం చేసుకునేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్‌ను నియమించాలని తెలిపారు. అలాగే అందరూ బాధ్యతగా పని చేయాలని, మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందని, నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని తెలిపారు. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది.. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్‌ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్‌ను కేంద్రానికి పంపుతామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story