- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
China : అంతరిక్షంలోకి తొలిసారిగా చైనా మహిళా వ్యోమగామి
దిశ, వెబ్ డెస్క్ : చైనా(China) తొలిసారిగా తమ దేశం నుంచి ఓ మహిళా వ్యోమగామి(female astronaut)ని అంతరిక్షంలోకి పంపింది. తాజాగా గన్స్ ప్రావిన్స్‌లోని జియూక్వియాన్ స్పేస్ సెంటర్ నుంచి షెంఝూ-19 మిషిన్‌లో భాగంగా బుధవారం ముగ్గురు యువ వ్యోమగాములను చైనా సొంతంగా ఏర్పాటు చేసుకున్న అంతరిక్ష కేంద్రమైన తియాంగాంగ్‌కు పంపించింది. వ్యోమగాముల్లో 34 ఏళ్ల మహిళా స్పేస్ ఫ్లైట్ ఇంజినీర్ వాంగ్ హవూజె కూడా ఉన్నారు. హవుజె కంటె ముందు మరో ఇద్దరు చైనా మహిళా వ్యోమగామిలు ఇతర దేశాల నుంచి అంతరిక్ష యాత్రల్లో పాల్గొన్నారు. చైనా సొంతంగా చేపట్టిన షెంఝూ-19 మిషిన్‌లో హవుజె తో పాటు మిషన్ కమాండర్ కై జుబె, సాంగ్ లింగ్ డాంగ్ లు ఉన్నారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం తర్వాత వాళ్లు స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఆరు నెలల పాటు ఆ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటారు. ఈ ప్రాజెక్టు కోసం లాంగ్‌మార్చ్-2 ఎఫ్ అనే భారీ రాకెట్‌ను వినియోగించారు. ఆ స్పేస్‌షిప్ అంతరిక్ష కేంద్రం కోర్‌మాడ్యూల్ తియాన్హేతో అనుసంధానమైంది.
ఈ ప్రాజెక్టు నుంచి వచ్చిన అనుభవంతో 2030 నాటికి చంద్రుడిపైకి యాత్రను చేపట్టాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్ సెంటర్ లోని వ్యోమగాములు స్పేస్ వాక్ తో పాటు పలు రకాల 86 ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మొత్తం 100 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టి నాసాను వెనక్కి పంపి మొదటిస్థానంలోకి రావాలని చైనా లక్ష్యం పెట్టుకుంది. మిత్రదేశాల వ్యోమగాములకు సైతం ట్రైనింగ్ ఇవ్వాలని చైనా భావిస్తోంది. కాగా చైనాలో అంతరిక్ష కార్యక్రమాన్ని ఆ దేశ సైన్యం నిర్వహిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో చైనాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి దూరం పెట్టారు. దీంతో చైనా సొంతంగానే తియాంగాంగ్ పేరిట స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని ప్రయోగాలు చేపడుతోంది. ఇదిఇలా ఉండగా తాజాగా వ్యోమగాములను స్పేస్ స్టేషన్ కు తరలించే తమ అంతరిక్ష ప్రయోగం విజయవంతమైందని చైనా మ్యాన్డ్ స్పెస్ ఏజెన్సీ (CMSA) ప్రతినిధి ప్రకటన చేశారు.