Honeymoon Destinations : కొత్తగా పెళ్లైందా..? మన దేశంలోని బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ ఇవిగో!

by Javid Pasha |   ( Updated:2024-11-22 08:23:09.0  )
Honeymoon Destinations : కొత్తగా పెళ్లైందా..? మన దేశంలోని బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ ఇవిగో!
X

దిశ, ఫీచర్స్ : అసలే పెళ్లిళ్ల సీజన్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివాహాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొత్తగా పెళ్లైన జంటలు బెస్ట్ అండ్ సేఫ్ హనీమూన్ డెస్టినేషన్ కోసం ఇటీవల ఆన్‌లైన్‌లోఎక్కువగా సెర్చ్ చేయడం పెరిగిపోయింది. అందమైన పర్యాటక ప్రాంతాలేవి? వాటి ప్రత్యేకతలేమిటి? ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్లాన్ చేసుకుంటారు చాలామంది. అలాంటి వారికోసం మన దేశంలో ఆకట్టుకునే హనీమూన్ డెస్టినేషన్స్ (Honeymoon Destinations)స్పాట్స్ ఎన్నో ఉన్నాయంటున్నారు పర్యాటక నిపుణులు. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రొమాంటిక్ ఫీల్ ఇచ్చే సిమ్లా

హిమాచల్ ప్రదేశ్‌‌లో ఉన్న సిమ్లా (Shimla) ఆహ్లాదకరమైన శీతల వాతావరణానికి ప్రసిద్ధి. కపుల్స్‌కు ఫుల్ రొమాంటిక్ ఫీల్ (romantic feel) ఇచ్చే బ్యూటిఫుల్ హనీమూన్ డెస్టినేషన్‌గానూ పేర్కొంటారు. ఇక్కడి అందమైన పర్వతాలు, పురాతన శిల్పాలు ఆకట్టుకుంటాయి. పచ్చిక బయళ్లు చూడముచ్చటగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి దాదాపు 19 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వింటర్‌లో సిమ్లాను ఒక్కసారైనా చూసి తీరాలంటారు చాలామంది. అంత అందంగా ఉంటుంది మరి!

అండమాన్ నికోబార్ దీవులు

కొత్తగా వివాహమై హనీమూన్ కోసం ఎదురు చూస్తున్న కపుల్స్‌ కోసం అండమాన్ నికోబార్ దీవులు (Andaman and Nicobar Islands) బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం జంటలను ఇట్టే ఆకట్టుకుంటుంది. అదో కొత్త ప్రపంచంలా, భూతల స్వర్గంలా అనిపిస్తుందని సందర్శకులు చెప్తుంటారు. స్వచ్ఛమైన నీటితో కూడిన విశాలమైన బీచ్‌లు ఆకట్టుకుంటాయి. ఇక్కడి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌ను నూతన దంపతులు మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హైదరాబాద్ నుంచి సుమారు 1, 682 కిలోమీటర్ల దూరంలో ఈ దీవులు ఉంటాయి. ఫ్లైట్‌లో వెళ్లడం బెస్ట్ ఆప్షన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రకృతి అందాల నెలవు శ్రీనగర్

అందమైన ప్రకృతి అందాల నెలవు శ్రీనగర్ (Srinagar). శీతాకాలంలో ఇది మరింత ఆకట్టుకుంటుంది. కశ్మీర్‌లోని ఈ ప్రాంతం ఎత్తైన హిమాలయ పర్వతాలతో అలరిస్తుంది. మంచు కురుస్తున్న ఉదయపు, సాయంత్రపు వేళలు కొత్త దంపతులను అందమైన ఊహల్లో విహరింపజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అక్కడి సరస్సులు స్వచ్ఛమైన తేట నీటితో, తేలియాడే తామరాలకులతో అలరిస్తాయి. నీటిలో చెక్క బోట్లపై విహరించడం జంటలకు మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. హైదరాబాద్ సిటీ నుంచి దాదాపు 2, 350 కిలో మీటర్ల దూరంలో ఉంది.

బీచ్‌లతో ఆకట్టుకునే గోవా

గోవా గురించి అందరికీ తెలిసిందే. మన దేశంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌గా ప్రిసద్ధి. అందమైన బీచ్‌లకు నిలయం. డే అండ్ నైట్ తేడా లేకుండా ఇక్కడికి ప్రజలు విహారానికి వస్తుంటారు. నూతన జంటలు కూడా ఒక్కసారైనా చూసి తీరాలనుకునే బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్‌లలో గోవా (Goa) చాలా ముఖ్యమైంది. ఇక్కడి పాలోలేమ్, అంజున, బాగా, కలంగూట్ వంటి బీచ్‌లు చూడముచ్చటగా ఉంటాయి. వాటర్ స్పోర్ట్స్, క్రూజ్ వివాహారాలు మరింత ప్రత్యేకం. హైదరాబాద్ నుంచి గోవా దాదాపు 670 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతీ రోజూ చాలామంది దంపతులు, టూరిస్టులు గోవాకు రాకపోకలు కొనసాగిస్తుంటారు.

జంటలను అలరించే అలప్పీ

ప్రకృతి అందాలకు, పచ్చిక బయళ్లకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు అలప్పీ (అలపుజ). కేరళ రాష్ట్రంలోని ఈ అందమైన ప్రాంతాన్ని హనీమూన్ డెస్టినేషన్ స్పాట్‌గా టూరిజం నిపుణులు పేర్కొంటారు. ఎల్లప్పుడూ బ్యాక్ వాటర్‌తో అలరిస్తూ, భూతల స్వర్గంలా అనిపిస్తుందని చెప్తారు. ఇక్కడి అందమైన పొలాలు, ఎగుడు దిగుడు లోయలు భలే ఆకట్టుకుంటాయి. అలప్పీ (Allappey) హైదరాబాద్ నుంచి సుమారు 1, 160 కిలో మీటర్ల దూరంలో ఈ హనీమూన్ డెస్టినేషన్ ఉంది.

Read More : జీవితంలో మీరు సంతోషంగా ఉండాలా..? ఈ రెండు విషయాలు తప్పక గుర్తుంచుకోండి!

Advertisement

Next Story

Most Viewed